Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSప్రభుత్వ భూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం ..!

ప్రభుత్వ భూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం ..!

spot_img
  • సర్వే నంబర్ 130 లో నా పట్టా భూమి ఉంది
  •  నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి..
  • కౌన్సిలర్లు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడేది లేదు 
  • పేదలను డబ్బుల కోసం పీడిస్తున్న బ్లాక్ మెయిల్  నాయకులను తాండూరు నుంచి తరిమికొట్టాలి 
  • నిర్మాణ స్థలం వద్ద సమావేశంలో అబ్దుల్ ఆహాద్

జనవాహిని ప్రతినిధి తాండూరు : సర్వేనెంబర్ 130 భూమి ప్రభుత్వానదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తాండూర్ చెందిన అబ్దుల్ ఆహాద్ పేర్కొన్నారు. ఈ భూమి తనదే అని అన్ని ఆధారాలు సర్వే రిపోర్టు సంబంధించిన పత్రాలను ఆయన చూపించారు. శుక్రవారం ఆయన నిర్మాణంలో ఉన్న స్థలం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లు కొన్ని రోజులగా ఈ విషయమై లేనిపోని ఆరోపణలు చేస్తూ తనను బద్నాం చేస్తున్నారని సూచించారు. ఈ భూమి ప్రభుత్వాని దని వారు ఆధారాలు చూపిస్తే దేనికైనా సిద్ధమని తెలిపారు. వారి వద్ద ఏమైనా ఆధారాలుంటే ప్రభుత్వానికి , మున్సిపాలిటీకి సమర్పించాలని అన్నారు. తప్పుడు ఆరోపణలు, చేసి బ్లాక్ మెయిల్ చేస్తే ఊరుకునేది లేదని, ఈ విషయమై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. 1983 నుండి తన వద్ద అన్ని ఆధారాలు, పేపర్లు ఉన్నాయని తెలిపారు. అధికారికంగా రెవెన్యూ, సర్వేయర్ సంయుక్తంగా సర్వే చేసి వచ్చిన మ్యాప్ ప్రకారం తాను నిర్మాణాలు చేస్తున్నానని అన్నారు. మున్సిపాలిటీలో ఈ స్థలానికి సంబంధించి పన్నులు సైతం చెల్లించానని చెప్పారు. పట్టణ ప్రజలు నాయకులు సహకారం అందిస్తే బ్లాక్మెయిల్ చేసే వారిని మటన్ నుంచి తరిమేస్తామని తెలిపారు. అవసరమైతే తాండూర్లో ఉన్న అందరిని జమచేసి వారు ఎవరెవరు వద్ద ఎంత డబ్బులు వసూలు చేశారు అనేది బయటపెడతానని తెలిపారు. పేదలు నిర్మించుకునే ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న చరిత్ర వారిదని, అన్నారు. మేము అవసరమైతే పేదలకు ప్రజలకు సహకారం అందిస్తామని తెలిపారు. మాపై ఆరోపణలు చేస్తున్నవారి చరిత్ర తాండూర్ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు.