- మున్సిపల్ సిబ్బంది కనుసన్నులోన్నే నిర్మాణం
- ఓ నాయకుడి అండతోనే ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్
- చలనం లేని టౌన్ ప్లానింగ్ అధికారులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం లోని సాయిపూర్… లోని ఓ ప్రభుత్వ భూమిలో భారీ షెడ్ నిర్మాణం జరుగుతుంది. పక్కనే డ్వాక్రా భవనం, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆ స్థలం పూర్తిగా ప్రభుత్వ భూమి. అందులో షెడ్ నిర్మాణం చేపడుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం చూసి కూడా చూడనట్టు వ్యవహారిస్తున్నారు. పట్టణం లో ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులలో మాత్రం చలనం రావడం లేదు. ఇదే చనువుగా పట్టణం లో కొందరు రాజకీయ నాయకుల అండ చూసుకొని పలువురు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే మాదిరిగా… పట్టణం లోని 9వి వార్డ్ లో అంగన్వాడీ కేంద్రం పక్కన ప్రభుత్వ భూమిలో ఓ భారీ షెడ్ అక్రమంగా నిర్మాణం జరుగుతుంది. ఇదే ముమ్మాటికీ ప్రభుత్వ భూనే అని, ఓ బిఆర్ఎస్ నాయకుడి అండతోనే నిర్మాణం చేసుకుంటున్నాను అని సదరు వ్యక్తి చెప్పడం గమనార్ధం. స్థానిక ప్రజలు కూడా ఈ నిర్మాణం పై విమర్శలు చేస్తున్నారు. ఐతే తాజాగా అక్కడ బోర్ వేశారు. ఆ బోర్ ప్రభుత్వం తరపున వేసారా లేక, సొంతంగా వేసుకున్నారా అనే అంశం స్పష్టత రావడం లేదు. ఈ అక్రమ నిర్మాణం పై మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి..




