- పార్థీవదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళి
- ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులకు ఓదార్పు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణానికి చెందిన మన్నపురం పరుశురాములు హఠాత్మరణం చెందడం పట్ల శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మృతుడి నివాసానికి చేరుకుని, పరుశురాం పార్థీవ దేహాన్ని సందర్శించారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.అనంతరం పరుశురాం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా పరుశురాం అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పరుశురాం పవిత్రాత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, ఆ కుటుంబానికి కొండంత మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శించిన వారిలో పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, సీనియర్ నాయకులు వడ్డెర శ్రీనివాస్, 22వ వార్డు కౌన్సిలర్ రాము, నాయకులు బిర్కిట్ రఘు, భగవాన్, శేఖర్, సిద్దు, శాంతూ తదితరులు ఉన్నారు.




