- తాండూరు కుర్రాడి అసాధారణ ప్రతిభ..
- 17 ఏళ్లకే ‘అష్టావధానం
- ధీరజ్ సాయిని అభినందించిన ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
- సాహిత్య రంగంలో పట్టణ కీర్తిని చాటిన యువకుడు
జనవాహిని ప్రతినిధి తాండూరు : చిన్న వయస్సులోనే అష్టావధానం లాంటి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి తాండూరు పట్టణానికి చెందిన ధీరజ్ సాయి అరుదైన ఘనత సాధించాడు. మల్రెడ్డిపల్లికి చెందిన ధీరజ్ సాయి (17), ఇటీవల స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రవీంద్ర భారతి, అవధాన కళాపీఠం హైటెక్ సిటీ సంయుక్త పర్యవేక్షణలో నిర్వహించిన “అష్టావధానం”ను అత్యంత ప్రతిభావంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.ఈ సందర్భంగా ధీరజ్ సాయి ప్రతిభను పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు. ఇంతటి కఠినమైన సాహిత్య ప్రక్రియను చిన్న వయస్సులోనే అవలీలగా ప్రదర్శించడం తాండూరు ప్రాంతానికే గర్వకారణమని ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన ధీరజ్ సాయితో పాటు, అతడి వెనుక ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పెద్దలు ఘనంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖులు గోపాలకృష్ణ బగ్రే, రిటైర్డ్ ఎంపిడివో బసనప్ప, రిటైర్డ్ టీచర్ బిచ్చప్ప, మాజీ కౌన్సిలర్ వినోద్ జైన్, పాప లాల్, జయప్రకాష్ పర్థాని, పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్లు జుంటిపల్లి వెంకటేష్, బాలకృష్ణ రెడ్డి, రాజు గౌడ్, పూజారి నర్సిములు, ముత్తయ్య ఆనందం తదితరులు పాల్గొని ధీరజ్కు శుభాకాంక్షలు తెలిపారు.




