Saturday, June 6, 2026

― Advertisement ―

గడప తట్టిన మాతృత్వపు కానుక…!

గర్భిణీలకు అండగా ‘కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్’ గడప గడపకూ వెళ్లి ‘శ్రీమంత కానుక’ అందజేత లబ్ధిదారుల హర్షం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కంజర్ల విజయలక్ష్మి...
HomeNEWSగడప తట్టిన మాతృత్వపు కానుక...!

గడప తట్టిన మాతృత్వపు కానుక…!

spot_img
spot_img
  • గర్భిణీలకు అండగా ‘కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్’
  • గడప గడపకూ వెళ్లి ‘శ్రీమంత కానుక’ అందజేత
  • లబ్ధిదారుల హర్షం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం ‘విజయక్క శ్రీమంత కానుక’ను ఘనంగా పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధినేత్రి కంజర్ల విజయలక్ష్మి స్వయంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, గర్భిణీ స్త్రీల ఇళ్లకు వెళ్లారు. వారికి సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం కానుకలను అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలకు చిన్నపాటి సాయంతో పాటు మానసిక ధైర్యాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. నేరుగా తమ గడప వద్దకే వచ్చి కానుకలు అందించడంపై గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కంజర్ల విజయలక్ష్మి సేవా గుణాన్ని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.