Saturday, June 6, 2026

― Advertisement ―

గడప తట్టిన మాతృత్వపు కానుక…!

గర్భిణీలకు అండగా ‘కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్’ గడప గడపకూ వెళ్లి ‘శ్రీమంత కానుక’ అందజేత లబ్ధిదారుల హర్షం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కంజర్ల విజయలక్ష్మి...
HomeNEWSపైలెట్ బర్త్‌డే జోష్...!

పైలెట్ బర్త్‌డే జోష్…!

spot_img
spot_img
  • ఘనంగా పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • రేపు ఉదయం తాండూరు క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్
  •  అనంతరం హైదరాబాద్ మణికొండ నివాసానికి తరలనున్న నియోజకవర్గ శ్రేణులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను రేపు తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ఒక ప్రకటనలో తెలిపాయి.రేపు ఉదయం 9 గంటలకు తాండూరు పట్టణంలోని రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. తాండూరులో కార్యక్రమం ముగిసిన వెంటనే, ఉదయం 10గంటలకు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు తరలివెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని మణికొండలో గల పైలెట్ రోహిత్ రెడ్డి నివాసానికి చేరుకుని, అక్కడ జరిగే జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు నేరుగా శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.ఈ జన్మదినోత్సవ వేడుకలకు తాండూరు నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు మరియు అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కమిటీ పిలుపునిచ్చింది.