Tuesday, June 2, 2026

― Advertisement ―

మతిలేని మాటలు మానుకోకపోతే ఖబడ్డార్..!

పూటకో మాట.. రోజుకో పార్టీ మార్చే వ్యక్తివి  అమరవీరుల కుటుంబాలను మీ నాయకుడు ఏం ఆదుకున్నాడు?  గత ప్రభుత్వ ఉత్తిత్తి మాటలకే ప్రజలు బొంద పెట్టారు. కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్..!  ...
HomeNEWSమహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం..!

మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం..!

spot_img
  • తాండూర్‌లో ఘనంగా మహిళా వారోత్సవాలు
  • మహిళా సంఘాలకు కోట్ల రూపాయల రుణాల పంపిణీ
  • నియోజకవర్గానికి 4 ఆర్టీసీ బస్సులు కేటాయింపు: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా, తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాల కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిర మహిళా శక్తి రుణాలు, బ్యాంక్ లింకేజీ చెక్కులతో పాటు మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడిపేలా నిర్ణయం తీసుకున్నామని, ఇందులో భాగంగా తాండూర్ నియోజకవర్గానికి 4 ఆర్టీసీ బస్సులను సీఎం కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరులు చేకూర్చాలనే ఉద్దేశ్యంతోనే.. వడ్ల కొనుగోలు కేంద్రాలు, చిరు వ్యాపారాలు, స్కూల్ యూనిఫామ్స్ తయారీ, మహిళా శక్తి క్యాంటీన్లు, మరియు ‘అమ్మ ఆదర్శ కమిటీల’ ద్వారా విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించినట్లు ఆయన గుర్తుచేశారు.తాండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మహిళా సమైక్య భవనాలు మంజూరయ్యాయని, వీటికి సంబంధించిన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.మహిళా వారోత్సవాల సందర్భంగా నియోజకవర్గంలోని పలు సంఘాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కోట్ల రూపాయల రుణాలను అందజేశారు.