Wednesday, May 13, 2026

― Advertisement ―

ఒకే వర్గానికి కొమ్ముకాస్తున్న కాంగ్రెస్..!

మున్సిపాలిటీలో ‘కో-ఆప్షన్’ రాజకీయం కాంగ్రెస్ తీరుపై బీజేపీ నిప్పులు అర్హతలకు పాతర.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలేనా..?  కాంగ్రెస్ తిరుపై బీజేపీ నాయకుల ఫైర్  జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్...
HomeNEWSనీట్ అక్రమాలు విద్యార్థుల పాలిట శాపం..!

నీట్ అక్రమాలు విద్యార్థుల పాలిట శాపం..!

spot_img
  •  పేపర్ లీకేజీ దోషులపై ఉక్కుపాదం మోపాలి
  • ఎయిమ్స్ ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలి
  • బీసీ సంఘం జాతీయ నేత రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్

జనవాహిణి ప్రతినిధి తాండూరు : దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు అత్యంత దురదృష్టకరమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని మండిపడ్డారు.ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివే విద్యార్థుల శ్రమను కొందరు స్వార్థపరులు అపహాస్యం చేస్తున్నారని రాజ్ కుమార్ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల ఒత్తిడి మధ్య పోటీ పడే పేద, మధ్యతరగతి మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు ఈ అక్రమాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పరీక్షల నిర్వహణలో వైఫల్యాలను ఎండగడుతూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. గతంలోనే నిపుణులు సూచించిన విధంగా ఆన్‌లైన్ పరీక్షా విధానంపై కేంద్రం సీరియస్‌గా ఆలోచన చేయాలన్నారు. అప్పుడే లీకేజీలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా, పరీక్షల నిర్వహణ బాధ్యతను పూర్తిస్థాయిలో ఎయిమ్స్ కు అప్పగిస్తేనే పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు తీసుకురావాలని, అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

NEET #NEETUG #NEET2026 #PaperLeak #JusticeForStudents #EducationSystem #AIIMS #NTA #OnlineExams #StudentFuture  Tandur #Vikarabad #Janavahini #RajKumarKandukuri #BCSangham #TelanganaNews #TandurNews