― Advertisement ―

ఆసుపత్రి మూసివేత కాదు.. అప్‌గ్రేడ్…!

కొడంగల్  కు మెడికల్ కాలేజీ.. వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల కల సాకారం   రూ. 150 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం  సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు ...
HomeNEWSగులాబీ గూటికి అంజాద్ అలీ పాషా..!

గులాబీ గూటికి అంజాద్ అలీ పాషా..!

spot_img
  • బిఆర్ఎస్‌లో చేరిన అంజాద్ అలీ పాషా
  • గులాబీ కండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణ రాజకీయాల్లో మార్పులు కొనసాగుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ అంజాద్ అలీ పాషా ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో నిర్వహించిన బిఆర్ఎస్ స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని, అంజాద్ అలీ పాషాకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని, బిఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.