― Advertisement ―

వార్డులో నూతన బోరు బావి…!

తాండూరు మున్సిపాలిటీ 26వ వార్డులో నూతన బోరు వేయించిన కౌన్సిలర్   స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులకు కృతజ్ఞతలు  హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు జనవాహిని ప్రతినిధి తాండూరు:తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ...
HomeNEWSకాంగ్రెస్ పథకాలే మా శ్రీరామరక్ష..!

కాంగ్రెస్ పథకాలే మా శ్రీరామరక్ష..!

spot_img
  • 36వ వార్డులో కాంగ్రెస్ విజయమే లక్ష్యం
  •  ప్రచారంలో దూసుకుపోతున్న ఆర్.బి.ఓ.ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
  •  కాల్వ సిరి చందనను గెలిపించాలని ఓటర్లకు విన్నపం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. శనివారం 36వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిరి చందన కు మద్దతుగా ఆర్.బి.ఓ.ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.​ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి పేదవాడు కాంగ్రెస్ పథకాలను గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. వార్డు అభివృద్ధి సిరి చందన తోనే  సాధ్యమని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కాల్వ సిరి చందన నాయకత్వాన్ని బలపరచాలని, మీ అమూల్యమైన ఓటుతో ఆమెను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.