- జర్నలిస్టుల పట్ల ఆర్టీసీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి
- కలెక్టర్ సమక్షంలో అక్రిడేషన్ కమిటీ సభ్యుల విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు
- అర్హులైన జర్నలిస్టులకు కార్డుల పంపిణీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : జిల్లా లో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల ఆర్టీసీ సిబ్బంది గౌరవప్రదంగా వ్యవహరించాలని, వారిని కించపరిచేలా ప్రవర్తించరాదని అక్రిడేషన్ కమిటీ సభ్యులు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో జరిగిన అక్రిడేషన్ కమిటీ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రయాణ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్రిడేషన్ కమిటీ సభ్యులు శెట్టి రావి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వార్తల సేకరణ కోసం నిరంతరం ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో బస్సు ఆపడంలోనూ, జర్నలిస్టుల వృత్తి గౌరవానికి భంగం కలిగించకుండా ఉండాలన్నారు. జర్నలిస్ట్ ల ఆత్మగౌరవాన్ని దెబ్బతియకుండా వ్యవహారించాలన్నారు. కమిటీ సభ్యుల అభ్యర్థనపై ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూస్తామని, సిబ్బంది ప్రవర్తనలో మార్పు కోసం ప్రత్యేక సూచనలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా వర్కింగ్ జర్నలిస్ట్ లకు, అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు లు అందజేస్తామన్నారు. సమావేశం ముగింపులో, మొదటి విడతలో ఎంపిక చేసిన అర్హులైన జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అక్రిడేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.




