Tuesday, May 26, 2026

― Advertisement ―

సమ్మెకు మద్దతు తెలిపిన జావీద్…!

విఏఓ ల సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వానికి కౌన్సిలర్ హెచ్చరిక విఏఓ లకు మద్దతు తెలిపిన జావీద్  జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమ్మెకు మద్దతుగా...
HomeNEWSఅభివృద్ధే ఊపిరి.. సేవలో రెట్టింపు ఉత్సాహం

అభివృద్ధే ఊపిరి.. సేవలో రెట్టింపు ఉత్సాహం

spot_img
  • అభివృద్ధే ఊపిరి.. సేవలో రెట్టింపు ఉత్సాహం
  •  24వ వార్డులో ముమ్మర ప్రచారం
  •   గత ఐదేళ్ల అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికీ పర్యటన
  •   మళ్లీ గెలిపిస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న హామీ

జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక 24వ వార్డు అభివృద్ధిలో తాము ఎప్పుడూ ముందుంటామని, గత ఐదేళ్లుగా అందించిన సేవలను ప్రజలు గుర్తించి మళ్లీ ఆశీర్వదించాలని బీజేపీ అభ్యర్థి సాహు శ్రీలత లక్ష్మీకాంత్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం వార్డులోని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ప్రజల నుంచి ఆమెకు ఘనస్వాగతం లభించింది.ఈ సందర్భంగా….. గత ఐదు సంవత్సరాల కాలంలో వార్డులో అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. గతంలో ఏ విధంగా అయితే మీతో ఉండి సేవ చేశానో, రాబోయే కాలంలో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాను” అని ఆమె వార్డ్ ప్రజలకు హామీ ఇచ్చారు.తాగునీరు, డ్రైనేజీ, సి.సి రోడ్ల నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ఏ సమయంలోనైనా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, తమపై నమ్మకంతో గతంలో అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాహు లక్ష్మీకాంత్, స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.