- పటేల్ కిరణ్ కుమార్ 42వ జన్మదిన వేడుకలు
- ఘనంగా సన్మానించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దంపతులు
- శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ ప్రముఖులు, భావిగి భద్రేశ్వర దేవాలయ పునరుద్ధరణ కమిటీ మాజీ చైర్మన్, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం రాత్రి పట్టణంలో ఘనంగా జరిగాయి. తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్.బిఓ ఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – సరళా రెడ్డి దంపతులు కిరణ్ కుమార్కు శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, సమాజ సేవలో ఉంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు పాల్గొని కిరణ్ కుమార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్ బంటు వేణు, నాయకులు బాతుల నాగు, జోషి వికాస్, కోటం సిద్దలింగం, సందీప్ రెడ్డి, జోగుల ఎబినేజర్, దేవనూర్ శంకర్ తదితరులు పాల్గొని పటేల్ కిరణ్ కుమార్ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.




