Friday, April 17, 2026

బసవేశ్వర జయంతికి ఏర్పాట్లు చేయండి…!

-

spot_img
  • మున్సిపల్ కార్యాలయంలో బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలి
  • చైర్‌పర్సన్, కమిషనర్‌కు వినతి పత్రం అందజేసిన 34, 36 వార్డుల కౌన్సిలర్లు

జనవాహిని ప్రతినిధి తాండూరు : సమాజ సంస్కర్త, జగజ్యోతి మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన అధికారికంగా నిర్వహించాలని కౌన్సిలర్లు కోరారు. గురువారం తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు, మున్సిపల్ కమిషనర్‌కు బిఆర్ఎస్ పార్టీకి చెందిన 34వ వార్డు మరియు 36వ వార్డు కౌన్సిలర్లు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుల రహిత సమాజం కోసం, సామాజిక సమానత్వం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాలకు ఆయన ఆశయాలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 20న మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారులందరూ ఇందులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు సుప్రీత కరుణాకర్, రూప రుద్రు పాటిల్ లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories