Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSఅంబేద్కర్ జయంతిని జయప్రదం చేద్దాం...!

అంబేద్కర్ జయంతిని జయప్రదం చేద్దాం…!

spot_img
  • రేపు తాండూరులో ‘జ్ఞాన భారీ ర్యాలీ’
  • పాత తాండూరులో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి 
  • తరలిరావాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు

జనవాహిని ప్రతినిధి తాండూరు : రేపు (ఏప్రిల్ 14) డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జై భీమ్ తాండూర్ టౌన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పాత తాండూరులోని అంబేద్కర్‌ పార్కులో ఉదయం ప్రత్యేక నివాళులు మరియు సభ ఉంటుందన్నారు.  ఈ సందర్బంగా తాండూరు పుర ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. సాయంత్రం వేళ స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్‌ చౌక్ నుండి పట్టణ వీధుల్లో భారీ ఎత్తున ‘జ్ఞాన భారీ ర్యాలీ’ నిర్వహించనున్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా, అన్ని కుల సంఘాల నాయకులు, పార్టీల కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్‌ చౌక్ నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో భారీ జనసందోహం పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.