Sunday, April 19, 2026

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు..!

-

spot_img
  • కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు 
  •  శుభాకాంక్షలు తెలిపిన యువనేత సందీప్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేస్తూ, అందరినీ కలుపుకుపోయే నాయకుడిగా గుర్తింపు పొందిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆర్బిఓఎల్ సీఈఓ జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అనుభవంతో, నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకుడని సందీప్ రెడ్డి అన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సందీప్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొని శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయనను భారీ గజమాలతో సత్కరించి, తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి, ఆయన రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ…శ్రీనివాస్ రెడ్డి తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఆయన నాయకత్వంలో యువత పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని ఈ సందర్భంగా సందీప్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.శ్రీనివాస్ రెడ్డి వంటి నిబద్ధత గల నాయకులు పార్టీకి ఉండటం గర్వకారణమన్నారు. ఆయన నాయకత్వం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువనేత సందీప్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories