15.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి – వెంపటి సైదులు బహుజన స్టూడెంట్స్ సంఘము రాష్ట్ర అధ్యక్షులు

ఓయూ ఏప్రిల్ 4 ( జనవాణి) :- వెంపటి సైదులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రావడానికి ముందే మా కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తామని పిఆర్ఓ ల ద్వారా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ అడ్మిషన్ లు చేస్తున్న ప్రముఖ కళాశాలపై ఇంటర్మీడియట్ అధికారుల దృష్టికి వెళ్లిన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తెలుపాలని అన్నారు. ముందస్తు అడ్మిషన్లు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ప్రకటన చేసినా అవేవీ పట్టించు కోకుండా అడ్మిషన్ చేపడుతున్న ఇట్టి కళాశాలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్య అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? వేసవి తరగతులు నిర్వహించరాదని ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసిన అవేవీ పట్టించుకోకుండా సమ్మర్ క్లాస్ పేరుతో విద్యార్థులను కళాశాలకు రప్పించి రెండవ సంవత్సరానికి సంబంధించి 80% ఫీజు కడితేనే క్లాస్ కు అనుమతి స్తామని విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న కళాశాలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.ప్రభుత్వం మారిన విద్యాశాఖ అధికారుల తీరు మారక పోవడం, ప్రైవేట్ కళాశాలల తో లోపాయికారీ ఒప్పందమా? లేక రాజకీయ ఒత్తిళ్ళ.? అని మండిపడ్డారు. అనుమతి లేని కళాశాలల పేరుతో భారీగా ఆ ప్రచారాలు నిర్వహిస్తూ ఐఐటి, నీట్, జేఈఈ కోచింగ్ ల పేరుతో లక్షలాది రూపాయలు దండుకుంటున్న బోగస్ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులుతనిఖీలు నిర్వహించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతి లేకుండా ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదని ఇంటర్ బోర్డు స్పష్టమైన ప్రకటన చేసిన, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులకు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇట్టి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బహుజన స్టూడెంట్స్ సంఘము మరియు వివిధ విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు విధులను విస్మరిస్తూ పరోక్షంగా ప్రైవేటు జూనియర్ కళాశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ రాజు ప్రవీణ్ నవీన్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles