WhatsApp Fake Calls: మీకు ఏదైనా తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వస్తే, ఎవరైనా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రభుత్వ అధికారి అని చెప్పుకుంటే, అది మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న స్కామర్ కావచ్చని గమనించండి. ఇలాంటి వాట్సాప్ కాల్స్ గురించి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT) భారతీయ పౌరులకు ఒక అలర్ట్ ను జారీ చేసింది. ఈ WhatsApp కాల్స్ కు స్పందిస్తే, వారు తమకు తాము ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ, వ్యక్తిగత డేటాను అడుగుతున్నారని డాట్ తెలిపింది. వ్యక్తిగత వివరాలు చెప్పకపోతే, మొబైల్ నంబర్ ను డీయాక్టివేట్ చేస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నారని కేసులు పెడ్తామని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడవద్దని సూచించింది.