15.4 C
New York
Sunday, May 19, 2024

Buy now

మార్కెట్ మహాలక్ష్మికి అండగా హీరో శ్రీ విష్ణు..

‘కేరింత’ మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా, నూతన పరిచయం ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వి.ఎస్. ముఖేష్ యువ దర్శకత్వంలో  బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని ప్రముఖ హీరో శ్రీ విష్ణు తాజాగా ఘనంగా లాంచ్ చేసారు. 

టీజర్ లాంచ్ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “మార్కెట్ మహాలక్ష్మి మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీ గా ఉంటూనే హీరో & హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి, అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నాను. డైరెక్టర్ వి.ఎస్. ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారని కోరుకుంటూ.. టీం అందరికి నా ఆల్ ది బెస్ట్.” అన్నారు

హీరో పార్వతీశం మాట్లాడుతూ.. “మా సినిమా టీజర్ ని రీలిజ్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి నా కృతజ్ఞతలు. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

కమెడియన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. “హీరో శ్రీ విష్ణు గారు మా సినిమా టీజర్ ని లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే, మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కథలు శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు. సో, మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రిలీజ్ కావడం నాకు ఆనందంగా ఉంది. పైగా, అయన నాకు ఎంతో ఇష్టమైన హీరో.” అన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles