HomeEntertainmentఓటీటీలోనూ అదరగొడుతున్న చిన్న సినిమా ..టాప్ ట్రెండింగ్!

ఓటీటీలోనూ అదరగొడుతున్న చిన్న సినిమా ..టాప్ ట్రెండింగ్!


ఓటీటీలోనూ అదరగొడుతున్న చిన్న సినిమా ..టాప్ ట్రెండింగ్!

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వంలో బత్తుల పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మే 22న విడుదలైన ఈ సినిమా, థియేటర్లలో సాధించిన సక్సెస్‌ను ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదికలైన ‘ఆహా’, ‘అమేజాన్ ప్రైమ్ వీడియో’ లలోనూ కొనసాగిస్తోంది.

Purusha OTT Success Bathula Pawan Kalyan Film Tops Charts on Aha amp amp Prime Video

ఓటీటీలోకి 'నాగబంధం' మూవీ.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్
ఓటీటీలోకి ‘నాగబంధం’ మూవీ.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్

కావల్సినంత వినోదాన్ని అందించారు

తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదంతో పాటు నవ్వులు పూయించే కామెడీ, కంటికి నీరు తెప్పించే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొంది సక్సెస్ సాధించారు. ఈ సినిమాలో కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ తమదైన టైమింగ్‌తో నవ్వుల పువ్వులు పూయించి చిత్రానికి ప్రధాన బలంగా నిలిచారు. అలాగే రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ పాత్రలు సైతం కథను నడిపించడంలో కీలక పాత్ర పోషించాయి. ముగ్గురు కథానాయికలు తమ నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వారికి మంచి క్రేజ్ లభించింది.

ఓటీటీలో రచ్చ.. కుర్రాళ్లకు కిక్కిచ్చే కొరియన్ టాప్-5 డ్రామాలు
ఓటీటీలో రచ్చ.. కుర్రాళ్లకు కిక్కిచ్చే కొరియన్ టాప్-5 డ్రామాలు

డిజిటల్ వేదికలపై ఆదరణ

మంచి వినోదాత్మక చిత్రం కావడం, కుటుంబమంతా కలిసి హాయిగా కూర్చుని చూసేలా ఉండటంతో ఈ సినిమాకు మహిళా ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఆహా మరియు ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే టాప్ స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చి రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. థియేటర్లలో అలరించినట్లే డిజిటల్ వేదికలలోనూ విశేషంగా ఆకట్టుకుంటున్న ‘పురుష:’ చిత్రం ఓటీటీ వేదికగా మరిన్ని వినోదాత్మక మైలురాళ్లను అందుకుంటుండటం విశేషం.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments