HomeEntertainmentJana Nayagan First Review: విజయ్ కు ఇదే లాస్ట్ సినిమా కాదు..!

Jana Nayagan First Review: విజయ్ కు ఇదే లాస్ట్ సినిమా కాదు..!


Jana Nayagan First Review: విజయ్ కు ఇదే లాస్ట్ సినిమా కాదు..!

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన జన నాయగన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన మూవీ సెన్సార్ బోర్డు వివాదం కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ. ఇటీవల సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసిన నేపథ్యంలో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే తెలుగులో అనిల్ రావిపూడి- బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రానికి ఇది రీమేక్ అని స్పష్టం అవుతోంది. కానీ జన నాయగన్ దర్శకుడు హెచ్. వినోథ్ తమిళ ప్రాంతం, విజయ్ ఫ్యాన్స్ కు అనుగుణంగా చిత్రంలో పలు మార్పలు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి నెక్స్ట్ సినిమా..? దురంధర్ కు మించిన విధ్వంసం..!
పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో రాజమౌళి నెక్స్ట్ సినిమా..? దురంధర్ కు మించిన విధ్వంసం..!

విజయ్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. వెట్రి కొండన్ అనే పవర్ ఫుల్ పాత్రలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కాయల్ అనే పాత్రలో మెరిసింది. ఇక తాను పెంచి పోషించిన విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాత్రను మమిత బైజు చేసింది. ఈమెకు మాఫియా డాన్ బాబీ డియోల్ ను ముప్పు ఉంటుంది. అయితే ఈ మాఫియా ఆగడాలను విజయ్ ఎలా అరికట్టారన్నదే స్టోరీ. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 3 గంటలు ఉంది. ఇక జన నాయగన్ మూవీలో పొలిటికల్ డైలాగ్స్, మాస్ సీన్స్ , డైరెక్టర్ వినోథ్ టేకింగ్ ప్లస్ పాయింట్స్ అని తెలుస్తోంది. ఫుల్ మూవీ రివ్యూ తెలియాలంటే జూలై 23 వరకు ఆగాల్సిందే.

JanaNayagan Here is the first review of the movie starring Kollywood star hero Thalapathy Vijay

ఇక జన నాయగన్ మూవీ పై దర్శకుడు హెచ్. వినోథ్ ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ కు ఇదే లాస్ట్ మూవీ కాదు.. ఇదే ఫస్ట్ మూవీ అని అన్నారు. ఆయన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే విజయ్ కు ఇది చివరి మూవీ అయినప్పటికీ సీఎం విజయ్​ కు మాత్రం ఇదే మొదటి సినిమా అనే ఉద్దేశంతో దర్శకుడు ఇలా మాట్లాడి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments