HomeNewsధర్నాలే కాదు.. సమాజ సేవలోనూ ముందే..!

ధర్నాలే కాదు.. సమాజ సేవలోనూ ముందే..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
  • బాలికల హాస్టల్‌లో ఉచిత వైద్య శిబిరం
  • సమాజ సేవలోనూ బీసీ సంఘం ముందుంటుంది
  • న్యూ లోటస్ హాస్పిటల్ సౌజన్యంతో విద్యార్థినులకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోగలరని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. తాండూరు పట్టణంలోని బీసీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో బీసీ సంఘం, న్యూ లోటస్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థినులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. బీసీ సంఘం అంటే కేవలం ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు మాత్రమే కాదని, సమాజ సేవలోనూ తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై తమకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఇందులో భాగంగానే తాండూరు నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.శిబిరానికి విచ్చేసిన న్యూ లోటస్ హాస్పిటల్ వైద్యులు విద్యార్థినులకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం తీసుకోవడంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థినులు ఆరోగ్య నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో న్యూ లోటస్ హాస్పిటల్ ప్రతినిధి మాణిక్యం, ఆసుపత్రి వైద్య బృందం, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సయ్యద్ షుకూర్, మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల, విజయలక్ష్మి, బీసీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బస్వరాజ్, యువ నాయకులు పాండు గౌడ్, నరసింహ, రాము ముదిరాజ్, దుబాయ్ వెంకట్, పరమేష్, మంతటి రాజు, హరి ప్రసాద్, యాసర్, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments