Lenin: హమ్మయ్య గండం దాటారు.. ఎవర్రా ఐరెన్ లెగ్!
Jul 10, 2026 3:13PM

అక్కినేని అభిమానుల మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’ ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ నుంచే షోస్ ప్రదర్శించడంతో అక్కినేని అభిమానులు చాలా ఉద్వేగపూరితమైన వాతావరణంలో థియేటర్స్ లో అడుగుపెట్టారు. ప్రేక్షకులది కూడా ఇంచు మించి అదే పరిస్థితి.
ఇందుకు కారణం ఉంది. అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ మూవీ నుంచి ప్రీవియస్ మూవీ ఏజెంట్ వరకు అఖిల్ కి హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. హీరో కట్ అవుట్, అందం, పెర్ఫార్మ్ అన్ని ఉన్నా హిట్ ని మాత్రం అందుకోలేకపోతుండటంతో అభిమానుల్లో తెలియని దిగులు పట్టుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కొంచం బెరుకుగానే థియేటర్స్ లోకి అడుగుపెట్టారు. కానీ ఒక్కసారిగా థియేటర్స్ లోకి అడుగుపెట్టగానే క్రమం క్రమంగా భయాలు అన్ని పటాపంచలు. సినిమా రన్ అవుతున్న కొద్దీ, స్క్రీన్ పై అఖిల్ పెర్ఫార్మ్ చేస్తున్న కొద్దీ సినిమా హిట్ అని తేలిపోయిందంటూ సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో అఖిల్ పెర్ఫార్మ్ కి స్టాండింగ్ ఒవేషన్ సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కళ్ళల్లో అఖిల్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని, పైగా ఊర మాస్ హిట్ కొట్టాడనే ఆనందం కనపడింది.
Also read: Lenin: లెనిన్ హైలెట్స్ ఇవే.. హిట్ కొట్టినట్టేనా!
భాగ్యశీ బోర్సే విషయానికి వస్తే తను సిల్వర్ స్క్రీన్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే అందం, పెర్ఫార్మ్ పోటీపడుతున్నాయేమో అనిపిస్తుంది. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలాన్ని చాలా బలంగా చాటగలదు. లెనిన్ ముందు వరకు చేసిన సినిమాలు ప్లాప్. దీంతో ఐరన్ లెగ్ అనే టాగ్ లైన్ ఇవ్వడానికి ఒక బ్యాచ్ రెడీ అయ్యింది . అలాంటి టైంలో లెనిన్ తో వచ్చింది. రావడమే కాదు మెస్మరైజ్ చేసే పెర్ ఫార్మ్ ని ప్రదర్శించడంతో పాటు అఖిల్ లా లెనిన్ విజయానికి కారణమైంది. థియేటర్స్ లో భాగ్యశ్రీ బోర్సే ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ఎవర్రా ఐరెన్ లెగ్ విత్ షార్ట్ పీరియడ్ భాగ్యశీ అగ్ర హీరోయిన్ అవ్వడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.







