Home Entertainment ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్‌ లు, థ్రిల్లింగ్ కథనం.. ఓటీటీని షేక్ చేస్తున్న హార్రర్ మూవీ..!

ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్‌ లు, థ్రిల్లింగ్ కథనం.. ఓటీటీని షేక్ చేస్తున్న హార్రర్ మూవీ..!

3
0


ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్‌ లు, థ్రిల్లింగ్ కథనం.. ఓటీటీని షేక్ చేస్తున్న హార్రర్ మూవీ..!

Google search engine

ప్రేక్షకుడు సినిమా చూసే విధానం మారిపోయింది. ఇన్నాళ్లు ఫలానా హీరో సినిమా అనగానే ఆ మూవీ ఎలాగున్నా చూడాల్సిందే అని అనుకునేవారు. కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. కంటెంట్ ఈజ్ కింగ్ అని స్పష్టం అవుతోంది. స్టార్ హీరోలు ఉన్నా.. రూ. వందల కోట్ల బడ్జెట్ లు పెట్టినా సినిమాలో కథ, కథనం సరిగ్గా లేకపోతే వాటిని ప్రేక్షకులు ఆదరించడం లేదు. చాలా సినిమాలు ఇలానే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రూ. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. మరోవైపు తక్కువ బడ్జెట్ తో కొత్త నటీనటులతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో పర్ ఫామ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఒరవడి విపరీతంగా పెరిగింది.

ఇక మలయాళం సినిమాలకు అక్కడే కాకుండా తెలుగుతో పాటు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అందుకు కారణం ఈ సినిమాలు తక్కువ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా కంటెంట్ లో కొత్తదనం ఉండటమే అని తెలుస్తోంది. తాజాగా ఓ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అదే Dose మూవీ.. ఈ మూవీ ఏకంగా 6 ఓటీటీల్లో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఈ మూవీలో ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్‌ లు, థ్రిల్లింగ్ కథనం.. ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

Dosemovie With spine-chilling twists and thrilling narrative horror movie is taking the OTT world

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ కథ మొత్తం హాస్పిటల్ లో జరిగే మరణాల చుట్టూ తిరుగుతుంది. ఆ మరణాలు చాలా అనుమానంగా, ఆందోళనకరంగా ఉంటాయి. ఆ మరణాల వెనక ఉన్న గుట్టు ఏంటో తెలుసుకోవడానికి అదే ఆస్పత్రిలో పని చేసే పల్మోనాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్(సిజు విల్సన్) ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ పోలీస్ ఆఫీసర్ సాయం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఆ డెడ్ బాడీల వెనక ఉన్న రహస్యం ఏంటి..? అనేది తెరపైనే చూడాలి. ఎలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ లు లేకుండా ఈ సినిమా చాలా నిశ్శబ్దంగా సాగుతూ కేవలం సన్నివేశాలతోనే భయపెట్టిస్తుంది. ఈ మూవీలో ప్రతి 20 నిమిషాలకు వచ్చే ట్విస్టులు ఊహకందని విధంగా ప్రేక్షకులను థ్రిల్
చేస్తుంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మూవీ ఓసారి చూసేడండి..



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here