మారుతి కారు కంటే చీప్‌గా వస్తుంది.. ప్రస్తుతం చాలా మంది ఇదే కావాలంటున్నారు.. బ్రెజ్జాను దాటేసింది!
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత తీవ్ర పోటీ ఉన్న 4 మీటర్ల లోపు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మహీంద్రా XUV 3XO తనదైన ముద్ర వేస్తోంది. ఒకప్పుడు XUV300 పేరుతో మార్కెట్లో ఉన్న ఆశించిన స్థాయిలో విక్రయాలను నమోదు చేయలేకపోయింది. అయితే మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్న మహీంద్రా, ఈ మోడల్‌కు పూర్తి స్థాయి మేకోవర్ ఇచ్చి XUV 3XO పేరుతో కొత్త అవతారంలో తీసుకొచ్చింది. కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు, పెట్రోల్-డీజిల్ ఇంజన్ ఆప్షన్లు, వేరు వేరు గేర్‌బాక్స్ ఆప్షన్లు, 5-స్టార్ భద్రతా ప్రమాణాలు, అలాగే పోటీదారులతో పోలిస్తే ఆకర్షణీయమైన ధర వంటి అంశాలు ఈ SUVకు భారీ ఆదరణ తీసుకొచ్చాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక మహీంద్రా షోరూమ్‌లలో XUV 3XO కోసం వినియోగదారుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది.
జూన్ 2026 అమ్మకాల్లో మహీంద్రా XUV 3XO మొత్తం 10,063 యూనిట్లు విక్రయించి కాంపాక్ట్ SUV విభాగంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సక్సెస్‌తో ఏళ్ల తరబడి ఈ విభాగంలో బలమైన స్థానాన్ని నిలబెట్టుకున్న మారుతి బ్రెజ్జాను వెనక్కి నెట్టింది. అదే సమయంలో బ్రెజ్జా విక్రయాలు 9,939 యూనిట్లకు పరిమితమయ్యాయి. XUV 3XO ప్రత్యక్ష పోటీదారు బ్రెజ్జా కంటే దీని ధర రూ. 72,000 వరకు తక్కువ.

మరో విశేషం ఏమిటంటే, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మహీంద్రా XUV 3XO అమ్మకాలు 42 శాతం పెరగడం. ఈ వృద్ధి, వినియోగదారుల నుంచి ఈ SUVకు లభిస్తున్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకప్పుడు అమ్మకాల కోసం పోరాడిన XUV300, ఇప్పుడు XUV 3XOగా మారి తన ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతూ, మహీంద్రాకు ఈ సెగ్మెంట్‌లో కొత్త అమ్మకాల గణంకాలను నమోదు చేస్తుంది.
దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.54 లక్షల నుంచి రూ.14.89 లక్షల వరకు ఉంది. మూడు ఇంజన్ ఆప్షన్లు అందిస్తోంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ TGDi టర్బో పెట్రోల్, అలాగే 1.5 లీటర్ డీజిల్ ఉన్నాయి. సాధారణ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, శక్తివంతమైన TGDi పెట్రోల్ వెర్షన్ 130 bhp పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది.

మరోవైపు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 117 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT, అలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను మహీంద్రా అందిస్తోంది. XUV 3XO EVను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది AX5, AX7L అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.13.89 లక్షలు, రూ.14.96 లక్షలుగా నిర్ణయించబడ్డాయి.
39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 285 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటిస్తోంది. భద్రత విషయంలో కూడా మహీంద్రా XUV 3XO తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన ఈ SUV, పెద్దల భద్రత విభాగంలో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, పిల్లల భద్రత విభాగంలో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.

భద్రతను మరింత పెంచేందుకు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, నాలుగు చక్రాలకూ డిస్క్ బ్రేకులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు వంటి ఫీచర్లను అందిస్తోంది. ఫీచర్ల పరంగా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 7-స్పీకర్ హర్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలగునవి ఉన్నాయి.






