Home Entertainment డైరెక్టర్‌పై పగబట్టిన స్టార్ హీరో ఫ్యాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రివెంజ్ స్టోరీ!

డైరెక్టర్‌పై పగబట్టిన స్టార్ హీరో ఫ్యాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రివెంజ్ స్టోరీ!

2
0


డైరెక్టర్‌పై పగబట్టిన స్టార్ హీరో ఫ్యాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రివెంజ్ స్టోరీ!

Jul 8, 2026 5:55PM

Google search engine

 

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజు థియేటర్ దగ్గర ఎరేంజ్ మెంట్స్ చేసే అభిమానుల ముఖాలు చూడాలి. వెయ్యి దీపావళులు ఒకేసారి వచ్చినట్టుగా వెలుగుతూ ఉంటాయి. పాలాభిషేకాలు, భారీ కటౌట్లతో పండగ వాతావరణం సృష్టిస్తారు. ఫర్ సపోజ్    మూవీ  గనుక  ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతే, ఆ కోపమంతా సదరు దర్శకుడిపైనే చూపిస్తుంటారు. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన సమాచారం ప్రకారం, ఒక స్టార్ హీరో అభిమానులు తమ హీరోకు డిజాస్టర్ ఇచ్చిన ఒక డైరెక్టర్‌పై వినూత్న రీతిలో సోషల్ మీడియా వేదికగా రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

 రీసెంట్ గా భారీ బడ్జెట్ తో ఒక సినిమా రిలీజ్ అయ్యింది. ప్రచార చిత్రాలతో మంచి హైప్ ని తెచ్చుకున్నా కూడా స్క్రీన్ ప్లే లోపాలతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో హీరో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎంతలా అంటే సోషల్ మీడియా పుట్టిందే మా కోసమే అనేంతలా. ఈ సోషల్ మీడియా దాడి వెనుక 100 శాతానికి పైగా పాత కక్షలే కారణమని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో ఆ దర్శకుడు సదరు స్టార్ హీరో బాడీ లాంగ్వేజ్‌కు భిన్నంగా సినిమా తీసి, కనీసం యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదనేది ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఆ సినిమా కేవలం 50 కోట్ల మార్కుని కూడా దాటలేకపోయింది, దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల తాలూకు చేదు జ్ఞాపకాలని  అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆ డైరెక్టర్ మూవీని టార్గెట్ చేస్తున్నారు.

Also read: Akhil Akkineni: మా నాన్న పని రాక్షసుడు.. లెనిన్ కామెంట్స్ వైరల్ 

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here