HomeEntertainmentసోనీతో సమంత.. బిగ్ అనౌన్స్‌మెంట్.!

సోనీతో సమంత.. బిగ్ అనౌన్స్‌మెంట్.!


సోనీతో సమంత.. బిగ్ అనౌన్స్‌మెంట్.!

Jul 4, 2026 4:17PM

ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టి, సమంత (Samantha) ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే ఉత్సాహంతో సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ తమిళ్ తో చేతులు కలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా సోనీ లివ్ తమిళ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని వివరాలను మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

ఒక వైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త‌ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు.  త‌మిళ్‌లో సోనీ లివ్‌లో సమంత చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించినప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం దీని గురించి చర్చించుకుంటున్నారు.

అయితే ఇదొక డిఫరెంట్ టాక్ షో అని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కాగా, సమంత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. అందుకే కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాంటిది ఇప్పుడు సోనీ లివ్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. టాక్ షో కాబట్టే, ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

 





Source link

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments