- ఏప్రిల్ 2న తాండూరులో వీర హనుమాన్ జన్మోత్సవం
- ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేసిన ఉత్సవ సమితి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న వీర హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్ర కు సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు బుధవారం తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా శోభాయాత్రను నిర్వహించేందుకు కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన వీధులన్నీ ఇప్పటికే హనుమాన్ జెండాలతో కాషాయమయమయ్యాయి. ఈ సందర్భంగా తాండూరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, హనుమంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకున్నారు. శోభాయాత్రలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సూచించారు.



