HomeTelanaganahyderabadఉచిత శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి

ఉచిత శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి

  • తాండూరు యువతకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్
  • ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్‌కు గడువు:
  • పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్

జనవాహిని ప్రతినిధి తాండూరు; పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకుల కోసం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు తాండూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాతుల నాగరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ….
సొంత ఖర్చులతో కోచింగ్ తీసుకోలేని పేద అభ్యర్థులకు చేయూతనందించాలనే లక్ష్యంతోనే ఎస్సై, కానిస్టేబుల్ సహా వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులను నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ ఉచిత శిక్షణలో చేరాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
కావాల్సిన పత్రాలు:
ఎస్సై/కానిస్టేబుల్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతి (జిరాక్స్)
* ఆధార్ కార్డు
* ఇంటర్, డిగ్రీ మార్కుల మెమోలు
అర్హులైన యువతీ యువకులు వెంటనే అవసరమైన ధృవీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని నాగరాజ్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments