- సిటీ కేబుల్ ఎండి నర్సింహారెడ్డి కూతురి పెళ్లికి హాజరైన బీసీ నేత షుకూర్
- నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర నాయకులు
- మాజీ మంత్రి సబితా రెడ్డితో భేటీ
జనవాహిని ప్రతినిధి తాండూరు; సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహా రెడ్డి కుమార్తె వివాహ వేడుక గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సైయాద్ షుకూర్ ప్రత్యేకంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.
ఈ వేడుక ప్రాంగణంలోనే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డితో సైయాద్ షుకూర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి కాసేపు పలు విషయాలపై ముచ్చటించారు. ఈ వివాహ మహోత్సవంలో వివిధ రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.
