- శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి రూ. 1,00,001 విరాళం
- ఆలయ కమిటీకి అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి దంపతులు
- తోడ్పాటు అందించాలని దాతలకు ఆలయ కమిటీ విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు; పట్టణంలోని ఇంద్రానగర్‌లో వెలసిన శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పటోళ్ల బాల్రెడ్డి దంపతులు ఉదారత చాటుకున్నారు. దైవచింతనతో ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం తమ వంతు సహాయంగా రూ. 1,00,001 నగదు విరాళాన్ని గురువారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
మందిర పునర్నిర్మాణానికి ఆర్థిక చేయూతనిచ్చిన నీరజ-బాల్రెడ్డి దంపతులకు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రధాన పునర్నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇంకా మండప నిర్మాణంతో పాటు పలు అనుబంధ పనులు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడానికి భక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థికంగా చేయూతనందించాలని కమిటీ సభ్యులు కోరారు.
