- తాండూర్ లో రేపు కాంగ్రెస్ ముఖ్య నేతల సమీక్షా సమావేశం
- హాజరుకానున్న టీపీసీసీ పరిశీలకులు
- ఎమ్మెల్యే అధ్యక్షతన సమావేశం ఏర్పాటు
జనవాహిని ప్రతినిధి తాండూరు; పార్టీ బలోపేతం మరియు రాబోయే కార్యక్రమాల దిశగా తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గ పరిధిలోని 269 బూత్‌ల బీఎల్‌ఏలతో రేపు మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటలకు కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ సర్ కన్వీనర్ కరణం పురుషోత్తము రావు ఓ ప్రకటనలో తెలిపారు.
అంతారం రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగే ఈ సమావేశానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. టీపీసీసీ ఆదేశాల అనుగుణంగా, సర్ ఫేస్ -2 ప్రక్రియపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ భేటీకి డీసీసీ అధ్యక్షులు ధారసింగ్ తో పాటు ప్రత్యేక పరిశీలకులు జగదీశ్వర్ రావు, వినయ్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు (చైర్మన్లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు) అందరూ తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని సక్సెస్ చేయాలని కన్వీనర్ పురుషోత్తము రావు పిలుపునిచ్చారు.
