- వరల్డ్ ఓపెన్ టైక్వాండోలో ‘సెయింట్ మార్క్స్’
- 12 పతకాలు కైవసం
- వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న తాండూరు విద్యార్థులు
జనవాహిని ప్రతినిధి తాండూరు; కరాటే టైక్యండో లో సేంట్ మర్క్స్ జూబ్లీ పాఠశాల మెరిసింది.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 21, 22, 23 తేదీలలో నిర్వహించిన మొదటి వరల్డ్ ఓపెన్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ లో తాండూరు సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. వివిధ దేశాల నుంచే కాకుండా దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పోటీపడి 1 బంగారు, 5 వెండి, 6 కంచు పతకాలను సొంతం చేసుకున్నారు.
అద్భుత ప్రతిభతో 12 పతకాలు సాధించడమే కాకుండా, విద్యార్థులు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పాఠశాలలో క్రీడాకారులను, కోచ్ టి. పురుషోత్తంను పాఠశాల హెచ్‌ఎం ఎం . జోసెఫ్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ ఉంటే క్రీడల్లో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. శ్రమను ఆయుధంగా చేసుకుంటే గెలుపు మన సొంతమవుతుందని సూచించారు. ఈ విజయం పాఠశాలకే కాకుండా తాండూరు పట్టణానికి, తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
