HomeEntertainmentఅప్పుడే ఓటీటీలోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'..? ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?

అప్పుడే ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..? ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


అప్పుడే ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..? ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస హిట్స్ తో జోష్ లో ఉన్నారు. ఇటీవల కరుప్పు తెలుగులో వీరభద్రుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీలో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్​ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. వెంకీ అట్లూరి గతంలో లక్కీ భాస్కర్, సర్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఈ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో ఆయన మరో ఘనత సాధించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతోంది. 4 రోజుల్లోనే రూ. 150 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది.

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ టికెట్ బుకింగ్స్ లోనూ సత్తా చాటుతోంది. తాజాగా బుక్​ మై షో యాప్ లో 2 మిలియన్లకుపైగా టికెట్ సేల్స్ జరిగాయని నిర్మాణ సంస్థ అధికారంగా వెల్లడించింది. అటు ఓవర్సీస్​ మార్కెట్​ లోనూ ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అమెరికాలో ఇప్పటివరకూ ఈ సినిమా 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఇక తమిళంలో కంటే తెలుగులోనే ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 38 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీకు సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ అయిన నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.

Suriya latest movie Viswanath and Sons coming to OTT so soon Streaming begin from that very day

ఈ నేపథ్యంలో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సెప్టెంబర్ 14 వ తేదీన తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్లలో అదరగొట్టిన సూర్య మూవీ ఓటీటీలో ఏ మేరకు రికార్డు వ్యూస్ ను రాబడుతుందో చూడాలి.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments