Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్‌పై యువతి ఫిర్యాదు.. ఏం చేశాడంటే..?
Rahul Sipligunj case ప్రముఖ సినీ గాయకుడు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు విశాఖపట్నం పోలీసులు షాక్ ఇచ్చారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో 11 మందిపై ఎమ్‌వీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది.
విశాఖపట్నానికి చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించి రాహుల్ సిప్లిగంజ్, ఆయనతో ఉన్న మరో 11 మంది తనను తీవ్రంగా బెదిరించారంటూ ఆరోపించింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని .. కొన్ని వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి ఫిర్యాదు చేసింది. రాహుల్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న సమయంలో అతడి బంధువుగా తన దగ్గరకు రాహుల్ సిప్లిగంజ్ వచ్చారని.. పరిచయం చేసుకుని తనను బెదిరించారని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. బలవంతంగా తనతో వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని.. తన పర్సనల్ ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగించారని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్‌వీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్‌తో సహా 12 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.హైకోర్డు లాయర్ గీతా ప్రసన్న చందన సహా మధ్యవర్తిత్వం వహించిన జర్నలిస్టులను కలిపితే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ముంజుగా ఎంపీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా.. ఆ తర్వాత కేసును ఎండాడ మహిళ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. తాజాగా వెలుగులోకి: ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు నెలల క్రితమే కేసు నమోదు చేసినప్పటికీ, తాజాగా ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలోనూ, టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై రాహుల్ సిప్లిగంజ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ స్పందించకపోవడం గమనార్హం.
అసలు ఆ యువతికి, రాహుల్ సిప్లిగంజ్ బృందానికి మధ్య ఉన్న వివాదం ఏంటి? బెదిరింపులకు దారితీసిన కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రజాదరణ పొందిన సింగర్‌పై విశాఖలో కేసు నమోదు కావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


