HomeTelanaganahyderabadసీసీ రోడ్డుకు శ్రీకారం...!

సీసీ రోడ్డుకు శ్రీకారం…!

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
  • హామీలను నెరవేర్చడమే నా ధ్యేయం
  • అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదు
  • 7వ వార్డ్ కౌన్సిలర్ ఇర్షాద్

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డ్ ఎన్టీఆర్ కాలనీలో కొత్తగా మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇర్షాద్ శనివారం ప్రారంభించారు. కాలనీవాసుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. కేవలం ఎన్టీఆర్ కాలనీ మాత్రమే కాకుండా వార్డ్ నెంబర్ 7 మొత్తాన్ని మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.అభివృద్ధి పనులకు ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించాలని చూసినా, ప్రజల కోసం చేసే పనులు ఏమాత్రం ఆగవని కౌన్సిలర్ ఇర్షాద్ హెచ్చరించారు. దమ్ముంటే పనులను అడ్డుకోవాలని సవాల్ విసిరిన ఆయన, ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నంతవరకు వార్డులో పెండింగ్‌లో ఉన్న ప్రతి ఒక్క పనినీ పూర్తి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చెప్పింది చేసి చూపించడమే తన లక్ష్యమన్నారు.

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments