Google search engine
HomeNewsజీడిపప్పు తింటే శరీరంలో ఏం జరుగుతుంది, వీరికి ఫుల్ ఎనర్జీ..!?

జీడిపప్పు తింటే శరీరంలో ఏం జరుగుతుంది, వీరికి ఫుల్ ఎనర్జీ..!?

Universal ePaper Clip Pro • Active

జీడిపప్పు తింటే శరీరంలో ఏం జరుగుతుంది, వీరికి ఫుల్ ఎనర్జీ..!?

మారుతున్న కాలంలో జీవన శైలి మారుతుంది. ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అందులో జీడిపప్పు ఒకటి. జీడిపప్పు పోషకాల నిల్వ. జీడిపప్పు లో ఫైబర్ తక్కువగా ఉంటుంద‌ని, దానిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి జీడిపప్పు అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. ముఖ్యమైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయితే, జీడిపప్పు ఎప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందో నిపుణులు సూచిస్తున్నారు.

జీడిపప్పు తినడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, రాగి, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉన్న జీడిపప్పు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చాలా ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఇందులో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కనిపిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం తప్పనిసరి. జీడిపప్పుతోపాటు జీడిపండు కూడా అనేక పోషకాలను అందిస్తుంది. పరిమిత మోతాదులో తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగకరంగా ఉంటాయి.

గ్రీన్ టీ ఎవరికి మంచిది, ఏ సమయంలో తాగాలి..!?
గ్రీన్ టీ ఎవరికి మంచిది, ఏ సమయంలో తాగాలి..!?

cashew-nuts-may-help-in-managing-diabetes-supporting-bone-health-and-improving-brain-function-he

నిపుణుల సూచనలు

జీడిపప్పును మితంగా తీసుకోవడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడ‌తాయి. శరీరంలో కాపర్ లోపం ఏర్పడితే ఇనుము వినియోగం సరిగా జరగక రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. జీడిపప్పు కూడా కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. జీడిపప్పు నుంచి తీసే నూనె చర్మ సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే జింక్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి ఖనిజాలు చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, సరైన మోతాదులో తీసుకుంటే బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. జీడిపప్పు తినడం వల్ల డయాబెటిస్ ఉన్న రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది . టైప్-2 డయాబెటిస్ రోగులకు పరిమిత పరిమాణంలో జీడిపప్పు తినిపించడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Universal ePaper Clip Pro • Active
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments