లోక్ సభ ఎన్నికలు ముగిసేవరకు
లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు సవరించిన గతంలో వసూలు చేసిన టోల్ ఫీజు ((Toll fee) రేట్లనే కొనసాగించాలని ఈసీఐ సోమవారం ఎన్హెచ్ఏఐ (NHAI) ని కోరింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఎన్నికలు జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. జూన్ 1 వ తేదీ నుంచి కొత్త టోల్ రేట్లు (Toll rate hike) అమల్లోకి వస్తాయి. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంలో మార్పుల ఆధారంగా ఎన్హెచ్ఏఐ (NHAI) ప్రతి సంవత్సరం టోల్ ఫీజు రేట్లను సవరిస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇది ఐదు శాతం పెరుగుతుందని అంచనా వేసింది. కొన్ని ఎక్స్ ప్రెస్ వే లకు కొత్త టోల్ ఫీజు (Toll fee) రేట్లను ఇప్పటికే వెల్లడించింది. జాతీయ రహదారులపై ఎన్హెచ్ఏఐ 855 టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. నేషనల్ హైవేస్ ఫీజు (రేట్లు, వసూళ్ల నిర్ధారణ) రూల్స్ 2008 ఆధారంగా వాహన యజమానుల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తోంది. ఎన్హెచ్ఏఐ (NHAI) 2022-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ ఫీజు ద్వారా రూ .54,000 కోట్లకు పైగా వసూలు చేసింది.