Home ఎంటర్టైన్మెంట్ Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి...

Family Star Fourth Song: ‘సొంత వాళ్ల కోసం ఎంత దూరమైనా’: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్

0

Family Star New Song: స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై భారీ హైప్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. వేసవి సెలవులు కావడం, మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే హైప్ ఉంది. ఈ సినిమాకు మూవీ టీమ్ ప్రమోషన్లను కూడా అదే రేంజ్‍లో చేస్తోంది. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి మరో సాంగ్ నేడు (ఏప్రిల్ 2) వచ్చేసింది.

Exit mobile version