― Advertisement ―

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…!

తాండూరులో ఘనంగా రైతు వారోత్సవాలు టీజీ ఆర్గానిక్ ' యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే బీఎంఆర్ కందిబోర్డ్  ఏర్పాటుకు హామీ..!  జనవాహిని ప్రతినిధి తాండూరు : రైతుల సంక్షేమం కోసం ప్రజా...
HomeNEWSరైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం...!

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…!

spot_img
  • తాండూరులో ఘనంగా రైతు వారోత్సవాలు
  • టీజీ ఆర్గానిక్ ‘ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే బీఎంఆర్
  • కందిబోర్డ్  ఏర్పాటుకు హామీ..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల ప్రణాళిక) రైతు వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తో కలిసి మంత్రి ‘టీజీ ఆర్గానిక్ యాప్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. భూసారాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే రైతులు రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఫాం ఆయిల్ సాగును ప్రోత్సహించాలని, విస్తారంగా తోటలు పెంచితే తాండూరు ప్రాంతంలో ఫాం ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రుణమాఫీ చేశామని, వరికి రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంత రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ ‘కంది బోర్డు’ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. తాండూరు మార్కెట్ యార్డు ఆధునీకరణకు మంత్రి సానుకూలంగా స్పందించారని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కోట్పల్లి ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు మంజూరు చేయించామని, దీని ద్వారా 14 గ్రామాలలోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత పాలకులు వ్యవసాయాన్ని విస్మరించారని ఆయన విమర్శించారు.అనంతరం జుంటుపల్లి సమీపంలోని రవి గౌడ్ ఫాం ఆయిల్ తోటను మంత్రి, ఎమ్మెల్యేలు మరియు అధికారులు సందర్శించి సాగు విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్, ఎమ్మెల్యే యాదయ్య, కార్పొరేషన్ చైర్ పర్సన్ సుజాత, ఏఎంసీ చైర్మన్లు పట్లోళ్ళ నర్సింలుబ్, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, అంజయ్య, మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.