- అక్రమ కేసులకు భయపడం,పైలట్ రోహిత్ రెడ్డికి సంఘీభావం
- తాండూరు కోటపై ఎగిరేది గులాబీ జెండానే: నరుకుల నరేందర్ గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెంటే కార్యకర్తలు, అభిమానులు ఉంటారని బీఆర్ఎస్ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్ స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్టై బుధవారం విడుదలైన రోహిత్ రెడ్డిని ఆయన నివాసంలో నరేందర్ గౌడ్,ల ఆధ్వర్యంలో తాండూరు లోని కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి సంఘీభావం తెలిపారు.అనంతరం నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా రోహిత్ రెడ్డి నాయకత్వంలో తాండూరులో బీఆర్ఎస్ బలోపేతంగా ఉందన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఏకతాటిపై నిలిచి, తాండూరు గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు తమకే ఉందని, ప్రత్యర్థుల ఆటలు సాగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




