Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSరామ మందిర అభివృద్ధికి దాతల తోడ్పాటు"

రామ మందిర అభివృద్ధికి దాతల తోడ్పాటు”

spot_img
  • శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి విరాళాల వెల్లువ
  • తాండూరు పట్టణ దాతల ఉదారత

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఆలయ పునర్నిర్మాణానికి పట్టణంలోని పలువురు ప్రముఖులు, భక్తులు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు. బుధవారం ఆలయ కమిటీకి పలువురు దాతలు విరాళాలు నగదును అందజేశారు.విరాళాలు అందజేసిన దాతలు… కర్ణం సందీప్ కుమార్: ₹11,111/- గుబ్బ యాదయ్య: ₹16,101/- తర్లపల్లి పురుషోత్తం: ₹11,000/- మురళీమోహన్ గౌడ్: ₹10,000/- వీరమల్లు మల్లేశం: ₹5,101/- రొంపల్లి శ్రీనివాస్: ₹5,101/-

వీరితో పాటు కర్ణం రాజేశ్వర్ రావు, కర్ణం సునీల్ కుమార్ కూడా ఆలయ నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “ఇందిరా నగర్ లోని ఈ పురాతన రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. దాతల సహకారం మరువలేనిది” అని కొనియాడారు.