- కేటీఆర్ మాటలకు.. పార్టీ ఆచరణకు పొంతన లేదు
- డ్రగ్స్ కేసు నిందితుడిపై సస్పెన్షన్ వేటు విషయంలో స్పష్టత ఇవ్వాలి
- తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతులు నాగు
జనవాహిని ప్రతినిధి తాండూరు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలకు, పార్టీ క్షేత్రస్థాయి ఆచరణకు అసలు పొంతనే లేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక, కేటీఆర్ మీడియా సమావేశంలో అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా పేరున్న రోహిత్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో, రోహిత్ రెడ్డిని గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని కేటీఆర్ ప్రకటించారు. అయితే, ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే జరిగిన కార్యకర్తల సమావేశంలో రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ కండువాతో పాల్గొనడంపై నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చెప్పిన మాటకు విలువ లేదా? లేక ఆయన మాటను సొంత పార్టీ నేతలే లెక్కచేయడం లేదా? దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి అంశాలపై ప్రజలను తప్పుదారి పట్టించేలా బీఆర్ఎస్ నేతలు కాలం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి వేసిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పలేక, ఇలా తప్పుడు ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారు అని నాగరాజు వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహారశైలితో ఆ పార్టీ సొంత కార్యకర్తలే అయోమయానికి గురవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాండూరులో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు అసలు తమ నాయకుడు ఎవరో కూడా అర్థం కావడం లేదని, పార్టీలో నెలకొన్న గందరగోళానికి కేటీఆరే బాధ్యత వహించాలని నాగరాజు పేర్కొన్నారు.
.#JanavahiniNews #TandurNews #TandurPolitics #CongressParty #BRS #KTR #BatulaNagaraj #TelanganaPolitics #Tandur #LatestNews




