Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSరామలయానికి 40వేల విరాళం...!

రామలయానికి 40వేల విరాళం…!

spot_img
  • రామ మందిర పునర్నిర్మాణానికి రూ. 40 వేల విరాళం
  • కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్‌లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పనులకు విరాళాల ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఆలయ పునర్నిర్మాణ పనులను పురస్కరించుకొని నరహరి గురుస్వామి ఆధ్వర్యంలో స్వాములు ఉదారతను చాటుకున్నారు. ఆలయ నిర్మాణ ఖర్చుల నిమిత్తం ఆయన రూ. 40,000 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరహరి గురుస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరా నగర్ వాసుల చిరకాల స్వప్నమైన రామ మందిరాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నామని, భక్తులు, దాతలు పెద్ద ఎత్తున స్పందించి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి ఆలయ నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు.