― Advertisement ―

ఇంటింటికీ పింఛన్న కేవైసి నమోదు…!

వార్డు ప్రజలకు అందుబాటులో పింఛన్ కేవైసి ప్రక్రియ  తాండూరు 30వ వార్డులో ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తున్న సిబ్బంది  కౌన్సిలర్ మెహరాజ్ బేగం నయీం అఫ్ఫు పర్యవేక్షణ జనవాహిని ప్రతినిధి తాండూరు :...
HomeNEWSఇంటింటికీ పింఛన్న కేవైసి నమోదు...!

ఇంటింటికీ పింఛన్న కేవైసి నమోదు…!

spot_img
  • వార్డు ప్రజలకు అందుబాటులో పింఛన్ కేవైసి ప్రక్రియ
  •  తాండూరు 30వ వార్డులో ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తున్న సిబ్బంది
  •  కౌన్సిలర్ మెహరాజ్ బేగం నయీం అఫ్ఫు పర్యవేక్షణ

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ 30వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ లబ్ధిదారుల ‘ఈ-కేవైసీ’ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దిశానిర్దేశం, మున్సిపల్ చైర్మెన్ నీరజా బాల్ రెడ్డి సహకారంతో, వార్డు కౌన్సిలర్ మెహరాజ్ బేగం నయీం అఫ్ఫు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా వారి ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపి బయోమెట్రిక్ నమోదు చేయిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, వికలాంగులు ఇబ్బంది పడకుండా కౌన్సిలర్ మెహరాజ్ బేగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మెహరాజ్ బేగం నయీం అఫ్ఫు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి చేరాలనేదే ఎమ్మెల్యే ఆకాంక్ష అని తెలిపారు. అందుకే వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.