― Advertisement ―

లంచం ఇస్తేనే పని చేస్తారు..!

యాలాల తహసీల్దార్ ఆఫీసులో 'లంచాల' పర్వం! డిప్యూటీ ఎంఆర్వో రూ.50 వేలు.. బంటు రూ.20 వేలు అడుగుతున్నారు ఆరు నెలలైనా కాని పట్టా రిజిస్ట్రేషన్.. కలెక్టర్‌కు మాజీ సర్పంచ్ ఫిర్యాదు జనవాహిని ప్రతినిధి...
HomeNEWSమానవత్వం చాటుకున్న దివిటి ఎల్లప్ప

మానవత్వం చాటుకున్న దివిటి ఎల్లప్ప

spot_img
  • వెంకటమ్మ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు దివిటి ఎల్లప్ప ఆర్థిక సాయం

జనవాహిని ప్రతినిధి తాండూరు : పాత తాండూరు 15వ వార్డుకు చెందిన మెంగార్గాని వెంకటమ్మ మృతి పట్ల కాంగ్రెస్ యువ నాయకుడు దివిటి ఎల్లప్ప తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ, గురువారం తుదిశ్వాస విడిచారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఆమె మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న దివిటి ఎల్లప్ప వెంటనే మృతురాలి నివాసానికి చేరుకుని, ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. తన వంతు సహాయంగా రూ. 3000 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జె. నరేష్, శివ కుమార్, మెంగరిగాని శ్రీనివాస్, గజ్జలప్ప మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.