― Advertisement ―

పార్టీ బలోపేతమే లక్ష్యం…!

పార్టీ బలోపేతమే లక్ష్యం,పట్టణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతా: బాతుల నాగు ధీమా వార్డు వార్డునా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణ కాంగ్రెస్...
HomeNEWSమహారాణా మార్గం.. మనందరికీ ఆదర్శం..!

మహారాణా మార్గం.. మనందరికీ ఆదర్శం..!

spot_img
  • రాజ్ పుత్ సమాజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తా
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేస్తామని హామీ
  • తాండూరులో ఘనంగా ప్రతాప్ జయంతి.. భారీ బైక్ ర్యాలీ
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి 

జనవాహిని ప్రతినిధి తాండూరు : మాతృభూమి విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అన్యాయంపై అలుపెరగని పోరాటం చేసిన వీర యోధుడు మహారాణా ప్రతాప్ అని, ఆయనను రాజపుత్రులు ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తాండూరు పట్టణంలో రాజ్ పుత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పట్టణ సమీపంలోని ఖంజాపూర్ వద్ద గల మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి బైక్‌లతో భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కాళికాదేవి ఆలయం, వినాయక్ చౌక్, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా భద్రేశ్వర్ చౌక్ వరకు కొనసాగింది. దారిపొడవునా ప్రతాప్ సింగ్ విజయోత్సవ నినాదాలతో పట్టణం మార్మోగింది.భద్రేశ్వర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్ పుత్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో చర్చించి, నిధుల మంజూరుతో పాటు హాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బిజెపి ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, PACS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ పాల్గొన్నారు.అలాగే రాజ్ పుత్ సమాజ గౌరవ అధ్యక్షులు ఠాకూర్ సుభాష్ సింగ్, అధ్యక్షులు దిలీప్ సింగ్, జనరల్ సెక్రటరీ శివానంద్ సింగ్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ రమేష్ సింగ్, వైస్ చైర్మన్ ఉమేష్ సింగ్, యువ దళ్ కన్వీనర్ దీపక్ సింగ్ ఠాకూర్, మహిళా సమాజ జిల్లా అధ్యక్షురాలు నిఖితా ఠాకూర్ మరియు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.