- ఆర్బిఓఎల్ సీఈఓ వివాహ వార్షికోత్సవంలో లీడర్ల కోలాహలం
- హోరెత్తిన శుభాకాంక్షలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వేడుక
జనవాహిని ప్రతినిధి తాండూరు : నిత్యం వ్యాపార సమీక్షలు, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – సరళ రెడ్డి దంపతుల జీవితంలో మరో మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. వారి వివాహ వార్షికోత్సవ వేడుకలు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఎంతో ముచ్చటగా జరిగాయి.శ్రీనివాస్ రెడ్డి దంపతుల వివాహ బంధం మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ.. పట్టణ కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలో వేడుకను దగ్గరుండి నడిపించారు. దంపతుల చేత కేక్ కట్ చేయించి, పుష్పగుచ్ఛాలతో ప్రత్యేకంగా సత్కరించి అభినందనల జల్లు కురిపించారు.ఈ సంబరంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు, కౌన్సిలర్లు బంటు వేణు, శ్రీకాంత్, జంటుపల్లి వెంకట్‌లతో పాటు పార్టీ ప్రతినిధులు బంటు మల్లప్ప, రాజు గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొని ప్రత్యేక హంగామా చేశారు. రాజకీయాలకతీతంగా, కేవలం స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ వెడ్డింగ్ యానివర్సరీ వేడుక పట్టణంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. తమ ప్రత్యేక రోజును మరింత గుర్తుండిపోయేలా చేసిన కాంగ్రెస్ శ్రేణులకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.




