Thursday, June 18, 2026

― Advertisement ―

ఘనంగా నూతన కమిటీ ప్రమాణస్వీకారం..!

సల్లా గార్డెన్స్‌లో మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నూతన కార్యవర్గానికి ఘన సత్కారం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ గంజ్...
HomeNEWSమాట నిలబెట్టుకున్న కౌన్సిలర్...!

మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్…!

spot_img
  • ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ శ్రీకాంత్
  •  10వ వార్డులో నూతన బోర్ వేయించి నీటి సమస్య తీర్చిన వైనం
  •  హర్షం వ్యక్తం చేస్తున్న వార్డు ప్రజలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన మాటను ప్రజాప్రతినిధులు నిలబెట్టుకుంటే ఆ వార్డు ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? సరిగ్గా ఇదే నిరూపించారు తాండూరు మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు.10వ వార్డు పరిధిలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ, ఆయన ప్రత్యేక చొరవతో వార్డులో నూతనంగా బోరుబావిని తవ్వించారు. గత కొంతకాలంగా నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఈ కొత్త బోర్ ఏర్పాటుతో పెద్ద ఉపశమనం లభించింది.ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వార్డులో నీటి సమస్యను తీరుస్తానని శ్రీకాంత్ మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అన్న మాట ప్రకారం నూతన బోర్ వేయించి తమ నీటి కష్టాలను తీర్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తమ కౌన్సిలర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కౌన్సిలర్ శ్రీకాంత్ తీరుపై వార్డు వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.