Thursday, May 28, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSనైట్ ఆపరేషన్.. అదిరిపోయిన రిజల్ట్...!

నైట్ ఆపరేషన్.. అదిరిపోయిన రిజల్ట్…!

spot_img
  • తాండూరు ‘నైట్ ఆపరేషన్….
  •  10వ వార్డులో ఏం జరిగింది? 
  • ఆ అర్ధరాత్రి వ్యూహం ఎవరిది?
  • ​స్క్రీన్ ప్లే అదిరింది.. సీన్ రివర్స్ అయింది..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : ​తాండూరు మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు కేవలం ఓట్ల పండుగ కాదు.. అదొక మైండ్ గేమ్! అందరి కళ్లు ఇప్పుడు ఒక్కటే వార్డుపై.. అదే ‘పదవ వార్డు’. అక్కడ పగలు ప్రచారం ముగిసినా, అసలు సినిమా అర్ధరాత్రి మొదలైంది.

ఎవరు ఆ ‘మిస్టరీ’ విజిటర్?

​అర్ధరాత్రి వేళ.. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్న వేళ.. సడన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తూ ముఖ్యమంత్రి సోదరుడు! ఒక వార్డు గెలుపు కోసం సీఎం సోదరుడే స్వయంగా రంగంలోకి దిగడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్’ ఏంటి?​10వ వార్డులో అడుగుపెట్టిన ఆయన వేసిన ఆ ‘సైలెంట్ స్టెప్’ ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచింది.

టార్గెట్: బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి…!  ​ఈ యుద్ధంలో కాంగ్రెస్ లక్ష్యం స్పష్టం. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని సొంత వార్డులోనే కట్టడి చేయడం.​చైర్మన్ పీఠం దక్కాలంటే ఆ అభ్యర్థి ఓటమే కీలకమని భావించిన హస్తం పార్టీ, అష్టదిగ్బంధనం చేసింది.​మైనారిటీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ఒక ప్రముఖ మైనారిటీ నేతను వ్యూహకర్తగా వాడింది. ఆ నాయకుడి వ్యూహం స్పష్టంగా ఫలించింది.

సైలెంట్ వార్.. రిజల్ట్ ఇదే…! 

​పగలు కనిపించిన జోరు కంటే, రాత్రి జరిగిన ‘సైలెంట్ ప్రచారం’ తాండూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.​బీఆర్ఎస్ ప్లాన్ ‘A’ అయితే.. కాంగ్రెస్ వేసింది పక్కా ప్లాన్ ‘B’. ​ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పక్క అనే పుకార్లు షికారు చేసిన తెర వెనుక కాంగ్రెస్ వేసిన ఎత్తుగడలు చూస్తుంటే ఫలితం ఊహకందని విధంగానే వచ్చింది. ఏకంగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 383 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

తాండూరు టాక్ ఆఫ్ ది టౌన్:

ప్రస్తుతం టీ కొట్టు నుంచి చౌరస్తా వరకు చర్చంతా పదవ వార్డు గురించే!​ముఖ్యమంత్రి సోదరుడి పర్యటన ప్రభావం తోనే కాంగ్రెస్ చైర్మన్ పీఠం కైవసం…​మైనారిటీ నేత మలుపు తిప్పిన రాజకీయం వార్ వన్ సైడ్.​చివరకు మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండానే ఎగిరింది.  ఈ ‘మిడ్ నైట్ పాలిటిక్స్’ తాండూరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. క్లైమాక్స్ లో కాంగ్రెస్ పార్టీ కే అనుకూలంగా మారింది ఈ నైట్ స్కెచ్….!